పర్యావరణాన్ని పరిరక్షించాలి

` కాలుష్య నియంత్రణకు కట్టుబడండి
` ప్లాస్టిక్‌ ఉపయోగం తగ్గించండి
` సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్‌ ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణగా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని, దానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు. సహజ వనరుల సంరక్షణకు ప్రతిసారీ ప్రభుత్వం కట్టు-బడి ఉంటుందని, రాబోయే తరాల కోసం ఈ వనరులను నిలుపుదల చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ సందర్బంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు. చెట్లను పెంచాలి, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి. మన ఆరోగ్యం కోసం కాదు, మన భవిష్యత్‌ తరాల భద్రత కోసమూ పర్యావరణాన్ని కాపాడాలని అంటూ ఆమె పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో, ఈసారి మరింత విస్తృతంగా చెట్ల నాటే కార్యక్రమాలను చేపట్టేందుకు మంత్రి సురేఖ అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ఉద్యోగులకు రెండు డీఏలు
` చెల్లించాలని మంత్రివర్గం సమావేవంలో నిర్ణయం
` ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు
` వారి పెండిరగ్‌ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తాం
` కొత్తగూడెంలోని ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీకి మన్మోహన్‌సింగ్‌ పేరు
` హోమ్‌ విధానంలో రోడ్ల ఆధునికీకరణ
` సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు
` మీడియాకు వివరించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చించింది. దాదాపు ఐదున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో.. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక, డీఏ, ఆరోగ్య భద్రత పెండిరగ్‌ బిల్లుల కార్యాచరణపై చర్చించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను భట్టి విక్రమార్క, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడిరచారు.
కేబినెట్‌ నిర్ణయాలివే..
ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించించి. ప్రస్తుతం ఒక డీఏ, ఆరునెలల తర్వాత మరో డీఏ చెల్లిస్తాం.రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేసే విధంగా క్యాబినెట్‌ నిర్ణయాలు ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తాం. బీమాకు ఉద్యోగులు ప్రతినెలా రూ.500చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత్త చెల్లిస్తుంది. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తాం. ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తాం.ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల పెండిరగ్‌ బకాయిలను నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లిస్తాం. పెండిరగ్‌ బకాయిలను నెలల వారీగా క్లియర్‌ చేస్తాం.గతేడాది 385 మంది మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణించారు. మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు మరణిస్తే రూ.10లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం.కొత్తగూడెంలోని ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీకి మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టేందుకు క్యాబినెట్‌ నిర్ణయం హోమ్‌ విధానంలో రోడ్ల ఆధునికీకరణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,100 కి.మీ, పంచాయతీరాజ్‌ పరిధిలో 7,947 కి.మీ రహదారులు ఆధునికీకరణ.