అన్నపూజ

మా రాజేశ్వరుడు సామాన్యుల దేవుడు మాజిల్లా చుట్టు పక్కల వున్న బీదాబిక్కి ఎంతో భక్తితో మావేములవాడ రాజ న్నకి   పూజలు చేస్తారు అమ్మ వారికి కుంకుమ పూజలు చేస్తారు ఎలాంటి గండాలు రాకుండా వుండటానికి గండా దీపంలో నూనె పోస్తారు. పశుసంపద బాగుండాలని దేవు నికి కోడెని కట్టేస్తారు. తమ పంటలు బాగా పండాలని అన్నానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వుండటానికి రాజేశ్వరునికి అన్న పూజలు చేస్తారు.

మావూరి దేవుడ్ని ఎముడాల రాజన్న అంటారు. మావూరి నిం డా ఆయన పేర్లే రాజన్న, రాజయ్య, రాజేందర్‌, రాజేశ్వర్‌. పేర్ల పక్క న శర్మ, రావు, శాస్త్రిలాంటివి వున్నా ఈపేర్లతోనే ఎక్కువగా వుంటా యి. మారాజేశ్వరున్ని దర్శించే చాలా కుటుంబాల్లో అవే పేర్లు. ఇంటి పేరుతో పిలుస్తేనే వాళ్ళకి గుర్తింపు.

మా రాజన్న గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది ప్రధానంగా శివక్షేత్రం కానీ హరిహర క్షేత్రంగా ప్రసిది.్ధ మారాజన్నకి రెండు సేవ లు పెద్దసేవ, చిన్నసేవ. పెద్దసేవ అంటే అంబారీమీద ఉత్సవ మూ ర్తులని ఊరేగించడం. చిన్నసేవ అంటే పల్లకీలో ఉత్సవం. మా రాజే శ్వరుని సేవతోబాటు హరిసేవ కూడా వుంటుంది. ముందు రాజన్న వెనక హరి. మారాజన్న గుడిముందు రాయబోసు దర్గావుంది. ఇక్క డికొచ్చే భక్తులు రాజన్నతోపాటు శ్రీరామున్ని అనంత పద్మనాభ స్వామిని బాలత్రిపుర సుందరిని దర్గాని కూడా దర్శిస్తారు. విఘ్నే శ్వరుడు, ఆంజనేయడు సరేసరి.

మారాజన్నదగ్గరికి మాజిల్లావాళ్ళు మాచుట్టు పక్కల జిల్లావాళ్ళు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి యాత్రికులు వస్తుంటారు. అదిలా బాద్‌ జిల్లా వాళ్లకి మా వేములవాడ రాజన్న ఆరాధ్యదైవం మా పెద్ద క్కని గంగవతలకి ఇచ్చారు. గోదావరి ని మా జిల్లాలో గంగ అంటా రు గంగవితల మేము గంగవతల మాపెద్దక్క కరీంనగర్‌, అదిలా బాద్‌ జిల్లాల మధ్య గోదావరి మాపెద్దక్క వూరినుంచి రైతులు మా వేములవాడ రాజన్న దగ్గరికి బండ్లమీద వచ్చేవాళ్ళు రెండు మూడు రోజుల ప్రయాణం వాళ్ళది మాపెద్దక్క సమాచారం తెచ్చేవాళ్ళు వెదు రు బద్దలతో చేసిన గంపలూ, చాటలూ  తెచ్చేవాళ్ళు మా ఇంట్లో వుండి వండుకొని తినేవాళ్ళు రాజన్నని దర్శించుకునేవాళ్ళు ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి, వేగమూ పెరిగింది ఇప్పుడు బండ్లలో రావ డం లేదు ఉదయాన రావడం సాయంత్రం పోవడం ఇప్పుడు మా రాజన్న ఎక్కువమందికి తెలిసిపోయాడు ప్రచారయుగంలో మా దేవునికి యాత్రికులు పెరిగారు.

మా వేములవాడ రాజన్నకి రైతులు ఇష్టపడి చేసే పూజ అన్న పూజ రైతులే కాదు అందరూ ఇష్టపడి చేసే పూజ అన్నపూజ మా అమ్మ సంవత్సరానికి రెండు సార్లౖెెనా ఆ పూజ చేసేది ఆరోజు మా ఇంట్లో పెద్ద హడావిడి ఉదయన్నే లేవడం తలస్నానం  చెయ్యాడం దేవుని కోసం మాత్రమే ఉపయోగించే గిన్నెలో అన్నం వండడం దాన్ని ప్రత్యేకమైన డబ్భాలో పెట్టడం ఆ తరువాత గుడికి బయల్దే రడం మా నామాల మల్లయ్య మావెంట వచ్చేవాడు అతనూ తల స్నానం చేసి వచ్చేవాడు అందరమూ కలిసి గుడికి బయల్దేరేవాళ్ళం. మేం కాసిన్ని పాలు తాగేవాళ్ళం కానీ మాఅమ్మ ఏమీ తీసుకునేది కాదు అట్లాగే మాబాపు కూడా దారిలో మురళి దుకాణంలో రెండు మూడు కొబ్బరికాయలు తీసుకుని గుడికి బయల్దేరే వాళ్ళం. ఆ అన్నం పెట్టిన డబ్భాని జాగ్రత్తగా మా మల్లయ్య తీసుకొచ్చేవాడు మధ్యహ్నం పన్నెండు గంటల ప్రాతంలో అన్నపూజ. అందరమూ అన్నంతినే సమయం, దేవునికి కూడా అదే సమయం. అందరం గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళం తెచ్చిన అన్నాన్ని తన చెయ్యితో లింగం మీద పానపట్టం మీద మా అమ్మ పెట్టేది అన్నం వేడిగా వున్నా చెంచాలని ఉపయోగించేది కాదు. ఏదేవుడ్ని ఎక్కడా తాకే అవకాశం వుండదు కాని శివుడు ఉదారవాది అందరినీ గర్భగుడిలోకి రాని స్తాడు మావేములవాడ రాజన్న మరీ ఉదారవాది తనమీద అన్నం పెట్టనిప్తాడు,

నీళ్ళు పొయ్యనిస్తాడు. దేవునిమీద అన్నం పెట్టిన తరువాత మా బుచ్చి కిష్టయ్య ఓ పదినిముషాలు మంత్రం చెన్పేవాడు. ఆతరువాత బయటకు వచ్చేవాళ్ళం కొద్దిసేపటి తరువాత దేవుని మీద పెట్టిన అన్నం అంతా తీసి డబ్బాల్లోకి ఎత్తేవాళ్ళం, అమ్మవారికి దండం పెట్టుకునేవాళ్లం మా అమ్మ కుంకుమ పూజ చేసేది. దేవునికి కొట్టిన కొబ్బరి కాయలు గుళ్లోనే ఖతం చేసేవాళ్ళం దార్లో ఏమైనా కొనుక్కు తినేవాళ్ళం ఇంటికొచ్చేసరికి రెండయ్యేది ఆ తరువాత మాకు అన్నం పెట్టేంది మా అమ్మ.

అప్పుడు అన్నపూజ చేసిన రోజు మా ఇంట్లో పెండ్లి  చేసినంత హడావిడి వుండేది కానీ ఇప్పుడు అలాంటి దేమి లేదు చాలా సింపుల్‌ పది గంటలకి వెళ్ళి అన్నపూజ టికె ట్‌ తెచ్చుకుంటే చాలా పన్నెండు గంటలకి వెళ్ల వచ్చు ఎలాంటి హడావిడి లేదు పండుగ వాతావరణం లేదు. అన్నీ మామూలుగానే మల్లయ్య అవసరం కూడా లేదు కొబ్బరి కాయలు మోసుకెళ్ళాల్సిన పనిలేదు అన్నం లీసుకుకెళ్ళాల్సిన పని అంతకంటే లేదు దేవు ని మీద అన్నం పెట్టాల్సిన అవసరం లేదు అంతా దేవాలయమే. దేవుని సత్రంలో అ న్నం వండుతారు  అది తెచ్చి దేవునిమీద పూజరులే పెడతారు. మనల్ని లోపలికి పిలి చి దేవుని మీద చేతులు పెట్టించి పూజ చే యించడం రెండు నిమిషాల్లో నలుగురితో కలిసి ఎంత మార్పు చిన్నతనానికి ఇప్పటికి మార్పు సహజం మారిన పరిస్థితుల ప్రకారం మనమూ మారా ల్పిందే అప్పుడు రోజుకి ఒకరిద్ధరు అన్నపూజ చేసేవాళ్లు. ఇప్పుడు వందల సంఖ్య దాటుతోంది అందుకే దేవస్థానం అధికారులు ఇట్లా మార్చినారు. వాళ్ళెనా ఏం చేస్తారు? ఏం చెయ్యగలం? దానికి అను కూలంగా పూజలు చెయ్యడం తప్ప.

మా ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు చాలా వంటలు ,ఏసేది మా ఆవిడ. మా అమ్మలాగే అందరూ వెళ్ళి పోయిన తరువాత అలసిపోయ్యేది, చేతకాకుండా అయిపొయ్యేది. ఆతరువాత ఎప్పుడు అనుకునే వాళ్ళం ఈ చాకిరి అంతా ఎందుకు హోటల్‌ నుంచి తెచ్చింది పెడితే సరిపోతుంది కదా అని అనేవాడ్ని మా బాపులాగే అవునని మా ఆవిడ అనేది కాని మళ్ళీ ఎవరైన వస్తే హోటల్‌ నుంచి తెప్పించకపొయ్యేది తనే వండేది.

నేనూ వద్దని అనపొయ్యేవాణ్ణి తను వండి పెట్టకపోతే ఆవిడకు సంతృప్తి వుండక పొయ్యేది అందుని కష్టమైనా ఓపిక తెచ్చుకొన్ని తనే  వండిపెట్టిది. నాకూ అలాగే వుండేది అదే మాకు తృప్తి కానీ మా వేములవాడ రాజన్న విషయంలో ఈ తృప్తి లేకుండాపోయింది కాల మహిమ ఎప్పుడైనా మావేములవాడ రాజన్నకి  అన్నం వండి అన్నపూజ చేసే అవకాశం దొరుకుతుందా? ఆఅదృష్టం మాకు వస్తుందా? ఎక్కడో చిన్న అశ దాని వెన్నంటే ఈ ప్రశ్నలకి సమా ధానం ఎవరూ చెబుతారు మా రాజన్నా! అధికారులా!! కానేకాదు కాలమే.

ప్రతిస్పందన

జింబో కథలు ఆత్మీయకోణాన్ని  ఆవిష్కరిస్తున్నాయి

జింబో కలం నుంచి వెలువడిన వేములవాడ కథలు ఒక వినూత్న ప్రయోగం. తెలుగు సాహిత్య రంగంలో కథా కథనరీతికి ఆత్మీయకోణాన్ని ఆవిష్కరించిన కథలుగా అశేష పాఠకాదరణ పొందిన అపురూప అక్షరదృశ్యాలు. మనుషుల మీద, విలువలమీద, మానవసంబంధాలమీద గౌరవాన్ని పెంచే కథలివి, వ్యవస్థలో నానాటికి తరిగిపోతున్న ప్రేమానుబంధాలు బలపడటానికి ఈ కథలు పునా దులు వేస్తాయి. ఈ కథలని మరోసారి ‘జనంసాకి’్ష పాఠకహృదయాలలో ఆవిష్కరిస్తున్న జనంసాక్షికి స్వాగతం పలుకుతూ అభినందనలందజేస్తున్నా.

మీ

వఝల శివకుమార్‌

కవి విమర్శకులు వేములవాడ

9441883210