అన్నాకు అండగా నిలవండి
కడప, జూలై 31: అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు అన్న హజారేకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కృష్ణ ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మంగళవారం నాడు ఒక ప్రకటనలో చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ విషయంలో యువత ముందుండాలని అన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అవినీతి వ్యతిరేకపోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.