అన్ని రంగాల కార్మికుల హక్కులకై సిఐటియు నిరంతర పోరాటం
– కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుంది హుజూర్ నగర్ సెప్టెంబర్ 9 (జనం సాక్షి): అన్ని రంగాల కార్మికుల హక్కులకై సిఐటియు నిరంతర పోరాటం చేస్తుందని సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి శెట్టి యాదగిరిరావు అన్నారు. శుక్రవారం రైస్ మిల్లర్స్ దిన కూలీల మహాసభ సిఐటియు కార్యాలయంలో సుల్తాన్, రాధా, చింతల వెంకటమ్మల అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సందర్భంగా యాదగిరి రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కొత్త చట్టాలను తెచ్చి రోడ్లపాలు చేస్తుందన్నారు. ప్రతి కుటుంబం బ్రతకాలంటే నెలకు 26 వేల అవసరం ఉంటుందని ప్రభుత్వం లెక్కలే ఉన్నాయని ఎక్కడి అసంఘటిత రంగాలలో ఈ రకమైన వేతనం రావటం లేదన్నారు. కనీస వేతనం 18,000 వే లైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సిఐటియు అన్ని రంగాల మహాసభలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా హుజూర్నగర్ లో మొట్టమొదలుగా దిన కూలీల మహా సభ జరుపుకుంటున్న మన్నారు. వ్యక్తులు సంఘంలోకి వస్తుంటారు పోతుంటారు సంఘం గొప్పదని అన్నివేళలా హక్కు లు సాధించుకునేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ సభ లో ప్రజా సంఘాల నాయకులు నాగారపు పాండు, చింతకాయల పర్వతాలు, ఇంటి తిరపయ్య, ఎలక సోమయ్య, నాగవెల్లి మంగ, వల్లపు దాసు లక్ష్మమ్మ, జింకల నాగమ్మ, మడ్డి రమణ, గోవిందమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీలం శ్రీను అధ్యక్షులుగా సుల్తాన్ ,రాధా ఉపాధ్యక్షులుగా నాగవెల్లి, మంగ కార్యదర్శిగా చింతల, వెంకటమ్మ సహాయ కార్యదర్శిగా, షేక్ ఫాతిమా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.