అన్నీ ప్రధానితో చర్చించి చేశా
2జీపై రాజా ఎదరుదాడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
2జీ స్పెక్ట్రమ్‌ల కేటాయింపుల్లో అన్నీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో చర్చించే నిర్ణయం తీసుకున్నామని టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు రాజా స్పష్టం చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో ప్రధానికి క్లీన్‌చీట్ ఇవ్వడంపై రాజా స్పందించారు. కుంభకోణానికి తనను మాత్రమే బాధ్యుడ్ని చేయడం సరికాదన్నారు. ప్రధానితో చర్చించాకే సమష్టి నిర్ణయాల మేరకు కేటాయింపులు చేశామన్నారు. రాజకీయ లబ్ధికోసమే తనను బాధ్యుడ్ని చేస్తున్నారని ఆరోపించారు. నిజాలు నిలకడమీద తేలుతాయన్నారు.