అప్పుల బాదతో ఉరేవేసుకోని కార్మికుని ఆత్మహత్య పై అధికారల విచారణ
శాయంపేట: అప్పుల బాదతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు బత్తుల వెంకట మల్లు ఉదంతంపై సోమవారం చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టరు రమణమూర్తి అభివృద్ధి అధికారి సాగర్‌లు విచారణ జరిపారు. వెంకటమల్లు కూతురు సంధ్య శాయంపేటలోని తన అమ్మమ్మ వద్ద ఉండగా అధికారులు అక్కడికి వెళ్లి విచారణ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీలు, శవ పంచనామా కాపీలు సేకరించారు. నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏడీ రమణమూర్తి తెలిపారు.