అప్రకటిత విద్యుత్‌ కోతలుండవు

C

మనది సర్‌ప్లస్‌ స్టేట్‌

మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి

ఆగమ శాస్త్రం ప్రకారం గుట్ట అభివృద్ధి

సాగర్‌ ప్రక్షాళన ఆగదు

విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి27(జనంసాక్షి): తెలంగాణలో అప్రకటిత విద్యుత్‌ కోతలు ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. వేసవిలో కరెంటు కొరత ఉండకుండా ప్రయత్నిస్తున్నామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. అలాగే బీడీ కార్మికులకు మార్చి 1 నుంచి పెన్షన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. అలాగే హైదరాబాద్‌ నాది అని అందరూ గర్వపడే విధంగా తాయారు చేసి చూపుతామని చెప్పారు. శుక్రవారం  సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివఙధ అంశాలపై ప్రభుత్వ నిర్ణయానలు ప్రకటించారు. యాదగిరి గుట్ట అభివృద్ది మొదలుకుని విద్యుత్‌, సాగర్‌ ప్రక్షాళన, బీడీ కార్మికులకు పెన్షన్‌  తదితర అంశాలపై స్పష్టంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను అధిగమించేందుకు కేరళలోని కాయంకుళం నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని తెలిపారు. కరెంట్‌ విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి కోతలు లేవన్నారు. ఏపీలో కలిసిన ఏడు మండలాలను రాష్ట్రం నుంచే విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్‌ రాష్టాన్రికి కి రావడం లేదని అన్నారు. కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్‌ లెక్కప్రకారం ఆలస్యంగా అయినా రావాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4300 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉంది. హైడ్రో పవర్‌ 2300 మెగావాట్లు ఉందని తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా 2వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తదని పేర్కొన్నారు. 2017 నాటికి వరకు రైతులకు 12 గంటల కరెంట్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. 2018 కల్లా మనమే 2,3 వేల మెగావాట్ల విద్యుత్‌ ను అమ్మే దశకు చేరుకుంటామని  అన్నారు. 2018 కల్లా తెలంగాణ సర్‌ ప్లస్‌ విద్యుత్‌ రాష్ట్రం అవుతుందని వెల్లడించారు. వందశాతం కరెంటు సమస్య రాకుండా చూస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ప్రస్తుతం అనధికార విద్యుత్‌ కోతలు లేవని, ఈ సీజన్‌లో విద్యుత కోతలు అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం 300 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామని, 2,300 మెగావాట్ల జలవిద్యుత్‌ అందుబాటులో ఉందన్నారు. రాష్టాన్రికి ప్రస్తుతం 4,300 మెగావాట్ల విద్యుత్‌ ఉందని వివరించారు. 2017లో సాగుకు 12గంటలు, పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు. 2018 నాటికి విద్యుత్‌ కోతలు ఉండవని, తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యుత్‌ విషయంలో ఆంధప్రదేశ్‌ సహకరించటం లేదన్నారు. విద్యుత్‌ అంశంలో కేంద్రం చెప్పినా ఏపీ పెడచెవిన పెడుతోందన్నారు. గవర్నర్‌, కమిటీ, కేంద్రం కూడా చెప్పినా రావడం లేదన్నారు.

బీడీ కార్మికులకు వేయి రూపాయల  భృతి

ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు బీడీ కార్మికుల సీఎం చంద్రశేఖర్‌రావు వేయి రూపాయల భృతిని ప్రకటించారు. ఈమేరకు ఇవాళ ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 1 నుంచి బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి చెల్లించనున్నట్టు సీఎం వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారం మొత్తం 4 లక్షల 90 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారని తెలిపారు. లక్షా 40 వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయని వివరించారు. 2 లక్షల 40 వేల మంది ఇప్పటికే ప్రభుత్వ భృతి పొందుతున్నారని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రావిడెంట్‌ ఫండ్‌ అందుకునే వారు లక్ష మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇతరత్రా లబ్ది పొందని వారే అర్హులని చెప్పారు. వీరిలో కాకుండా ఇంకా ఎవరైనా అర్హులుంటే మళ్లీ నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. అనవసరంగా ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. భృతి అందని కార్మికులు ఉన్నట్లు గుర్తిస్తే కార్మిక  నేతలు కూడా కార్మికులతో ధర్నాలు చేయించ వద్దని ఎమ్మార్వో వద్దకు తీసుకెళ్లి దరఖాస్తు పెట్టించాలని కోరారు. ఇంకా 20 వేలు కాదు 50 వేల మంది ఉన్నా భృతిని చెల్లిస్తామన్నారు. ఇన్ని లక్షల మందికి ఇచ్చినపుడు ఇంకొ 50 వేల మందికి ఇవ్వడం ప్రభుత్వానికి భారం కాదన్నారు. కాకపోతే ఏది చేయాలన్నా ప్రభుత్వం పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఒక్కరే రెండు మూడు రకాలుగా ఆర్థికసాయం పొందవద్దని కోరారు. బీడీ కార్మికులను