అప్రమత్తమైన మండల నాయకులు, తహసిల్దార్ ముజీబ్ ,ఎస్ఐ రవీందర్ ,విఆర్ఓ జావిద్,
(జనంసాక్షి):
తెలంగాణతో పాటు
రుద్రూర్ మండల కేంద్రంలో
భారీగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి నష్టం ప్రజలకు కలగకుండా చూడడం కోసం రుద్రూర్ తహసిల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్, వీఆర్ఓ జావిద్ లు కలిసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చెరువులు, వాగులు పొంగి పోతే తూముల ద్వారా నీటిని వదిలి పెట్టడం, వాగులు పొంగి పొర్లుతూ ఉంటే రహదారులు మూసివేయడం, ప్రతి వీధుల గుండా గ్రామాలలో సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు, వర్షం వల్ల ఎక్కడైనా, భారీగా నీటి ఉధృతి వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మండల కేంద్రంతో పాటు 10 గ్రామాలలో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తం అవుతున్నారు, రుద్రూర్ నుంచి బొప్పాపూర్ కు వెళ్లే ప్రధాన రహదారి బొప్పాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వంతెన వర్షపు నీటితో పొంగిపొర్లదంతో రహదారి జల దిగ్బంధం అయిందని జడ్పీటీసీ నారోజి గంగారాం అధికారులకు తెలపటం తో, అప్రమత్తమైన రుద్రూర్ తహసీల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్, వీఆర్వో ముజీబ్ తో సిబ్బంది కలిసి వెంటనే రహదారిని, ప్రజలు ,వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు ఈ రహదారి గుండా వెళ్లరాదని సూచన చేశారు. రుద్రూర్ చెరువు నుంచి వర్షపు నీరు వెళ్లే తూములు సైతం పరిశీలించారు, తూములు మరమ్మతులకు వచ్చాయా, నీరు పోతుందా లేదా అనే విషయాలపై ఆరా తీసి వివరాలను సేకరించారు. రుద్రూర్ చెరువు పొంగి పోవడంతో ఈ నీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వివరాలను జిల్లా స్థాయి అధికారులకు చేరవేస్తున్నారు. ముగ్గురు అధికారులతో పాటు మండల నాయకులు , జడ్పీటిసి నారోజి గంగారాం, అక్కపల్లి నాగేందర్ అధికారులకు ఎప్పటికప్పుడు ప్రజలు తెలిపుతున్న వివరాలను అధికారులకు అందజేస్తున్నారు, అధికారులు సైతం మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రతి గ్రామాలలో తిరుగుతూ వర్షపు నీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు, వారు చేస్తున్నా కృషి పట్ల ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు