అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలి

పి ఓ డబ్ల్యు డిమాండ్
కేసముద్రం జులై 7 జనం సాక్షి/మండల కేంద్రంలో గురువారం అభయహస్తం డబ్బులు చెల్లించాలని,పెంచిన వంట గ్యాస్ సిలెండర్ ధరను తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఎంపీడీవో ఆఫీస్ వరకు అరుణోదయ కళాకారులచే నృత్యాల చే భారీ ర్యాలీ అనంతరం ఎంపీడీవో రోజా రాణి కి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈకార్యక్రమం ఉద్దేశించి పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బొమ్మనబోయిన అనసూయ  మాట్లాడుతూ నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రతి మహిళకు పెన్షన్ కింద అభయ హస్తం ఉపయోగపడుతుందని చెప్పి వయసుకు తగ్గట్టుగా ప్రతి మహిళ దగ్గర డబ్బులను పొదుపు చేయడం జరిగింది.నేటి కేసీఆర్ ప్రభుత్వం అభయ హస్తం డబ్బుల గురించి కానీ,అభయ హస్తం కింద మహిళలకు పెన్షన్స్ ఇవ్వాలని కనీసం ఆలోచించడం లేదన్నారు.నేటివరకు అభయ హస్తం క్రింద డబ్బులు చెల్లించిన ప్రతి మహిళకు వెంటనే డబ్బులను తిరిగి ఇవ్వాలని లేదా వృద్ధాప్య మహిళలకు అభయ హస్తం పెన్షన్లు  మంజూరు చేయాలని ప్రగశీల మహిళా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేనియెడల మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కోశాధికారి కామ్రేడ్ సామ రజిత, జిల్లా నాయకురాలు మంద పద్మ,సరస్వతి, బబ్బురి లక్ష్మి,చిట్టిమల్ల యాక లక్ష్మి,సారు కవిత, ఎండి కవిత,రమ,లక్ష్మి,రామక్క,పద్మ,సంతోష, ఎల్లమ్మ,సుజాత,మంగమ్మ తదితరులు పాల్గొన్నారు