అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తాం : వెంకయ్యనాయుడు
వరంగల్ : అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తామని భాజపా సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్ లో నిర్వహించిన భాజపా జనచైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉండడం నష్టం లేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ కూడా ప్రతినిధులు చేస్తున్న పోరాటం అధికార దాహంలా ఉందన్నారు.