అభివృద్ధికి ఆమడ దూరంలో

 

పినపాక నియోజకవర్గం జూలై 12 (జనం సాక్షి): ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మణుగూరు మండలం రాజుపేట లోని రహదారులు వర్షపు నీటితో రోడ్లన్ని అద్వాన్నంగా తయారయ్యాయిని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజుపేట అంతర్గత రోడ్లన్నీ పిచ్చి మొక్కలు పెరిగి దోమలకు నెలవుగా మారింది. మురికి కాలువలు చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతూ నడవడానికి వీలు లేనంతగా బురద నీరు చేరి స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మొన్న జరిగిన పట్టణ ప్రగతిలో భాగంగా రాజుపేట గ్రామంలో ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేయకపోవడం తో వర్షం వచ్చినప్పుడు చెత్తాచెదారంతో మురికి నీటితో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. మున్సిపాలిటీ అధికారులకు ఇంటిపన్నులు కట్టించుకునే శ్రద్ధ, పరిశుభ్రతపై లేదని అన్నారు.వర్షాలు వచ్చాయంటే ఇండ్లకే పరిమితమై ఎటు వెళ్లలేని పరిస్థితి రోజు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని నిరుపేదలకు జీవనం కష్టంగా మారింది. మణుగూరు పట్టణం దినదినాభివృద్ధి చెందటంలో పరుగులు పెడుతుంటే కిలోమీటర్ దూరంలో ఉన్న రాజుపేట గ్రామం అభివృద్ధి కి నోచుకొకపోవడం ఆ గ్రామస్తులు చేసుకున్న పాపమా లేదా అధికారులు నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు.రహదారులు , డ్రైనేజీలు మురుగు కాలువలు సరిగా లేక ఇండ్లలో నీరు చేరి ఇండ్ల గోడలు నిమ్మెక్కి ఎప్పుడు కూలి పడతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. చిన్నపిల్లల వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నా పట్టించుకోని వైద్యులు.
సింగరేణి ప్రభావిత గ్రామ ప్రాంతాలకు ఏమి చేశారని ఉన్న పార్కులో లేనట్టు లేని పార్కులో ఉన్నట్టు సివిల్ కాంట్రాక్టర్ జేబులు నింపుతున్నారే తప్ప , వీరు చేసిందేమీ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు, సంవత్సరానికి కోట్ల రూపాయలు వస్తున్నాయిని అభివృద్ధి చేస్తున్నామని సింగరేణి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికే తప్ప, ఇక్కడ ఒరిగింది ఏమిలేదనన్నారు.మున్సిపాలిటీ పట్టణ ప్రగతి నిధులతో పాటు రకరకాల నిధులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు, వచ్చే నిధులతో ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో , ఎవరిని ఉద్ధరిస్తున్నారో తెలియటం లేదన్నారు..రాజుపేట ప్రధాన రహదారిపై అడుగుపెట్టే పరిస్థితే లేదు , రాత్రి పగలు అనే తేడా లేకుండా బొగ్గు , ఇసుక లారీలు అతివేగంతో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శిక్షణ, లైసెన్సులు లేని డ్రైవర్లతో వేగ నియంత్రణ లేకుండా వాహనం నడపడంతో గేదేల, మేకల, ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆ తర్వాత ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే గాని శాశ్వత పరిష్కారం చూపు లేకపోతున్నారు.
రాజపేట గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి , మున్సిపాలిటీనా, సింగరేణినా, గెలిచిన ప్రజాప్రతినిధులా తెలియని అయోమయంలో పరిస్థితుల్లో ఆ గ్రామ ప్రజలు. ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.