అభివృద్ధి,సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి -డోర్నకల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్
డోర్నకల్/ జూలై 30,జనం సాక్షి న్యూస్:అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం డోర్నకల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ వంకుడోత్ వీరన్న అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అభివృద్ధి పనులపై సమీక్షించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. డోర్నకల్ పట్టణంలోని 15 వార్డులలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పలు అంశాలపై మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు చర్చించారు. డోర్నకల్ పట్టణంలో త్వరలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పర్యటన ఉన్నందున, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాలని, స్పెషల్ శానిటైజర్ డ్రై చేపట్టుట గురించి, 15 వార్డులలో అవెన్యూకు గ్రీన్ బడ్జెట్ నిధుల నుండి సుమారు 9 లక్షల 98 వేల రూపాయల ఖర్చు కౌన్సిలర్ల ఆమోదం, మెప్మా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ స్టేషనరీ ఖర్చులు, పట్టణ ప్రగతి, మైనార్టీ స్కూల్ సమస్యలపై, వివిధ అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశంలో చర్చించి వాటిని పరిష్కరించే విధంగా ఆమోదం తెలిపారు. ఇంటింటికీ శుద్ధి చేసిన మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశవబోయిన కోటిలింగం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ ,తాసిల్దార్ స్వాతి బిందు,సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, వార్డు కౌన్సిలర్లు అశోక్, శరత్, బోడ నీలా హరిలాల్, వీరన్న, సురేందర్ జైన్, కాల మౌనిక యశోదర్ జైన్, కొండేటి హేమచంద్రశేఖర్, కో ఆప్షన్ మెంబర్లు అజిత్ మియా, మారబోయిన రాంబద్రం, మైనార్టీ నాయకులు గౌస్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏపూరి వెంకటేశ్వర్లు,లాయర్ రమేష్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.