అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

మల్హర్ రావు, జనంసాక్షి
మండలంలోని నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ సరోవర్ పథకంలో భాగంగా నిర్మాణం చేసిన చెరువును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.  చెరువు కట్ట యొక్క నాణ్యత ప్రమాణాలను సంభందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆయకట్టు కింద ఉన్న ఇరవై ఎకరాల రైతులతో మాట్లాడారు. చెరువు మత్తడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ సరోవర్ పథకంలో భాగంగా చెరువును మంజూరు చేసినందుకు ఆయకట్టు కింద ఉన్న రైతులు నాగలిని కలెక్టర్ కు భహుకరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రీన్ బడ్జెట్ నిధులతో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలు అందుతున్నాయ లేదా అడిగి తెలుసుకున్నారు. అన్సాన్ పల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు మన బడిలో భాగంగా చేపట్టిన పనుల్లో నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పలువురు రైతులు తమకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని ధోరణిలో తమ పేర్లు నమోదు కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని తహసీల్దార్ శ్రీనివాస్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి పురుషోత్తం, మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ నరసింహమూర్తి, ఎంపీఓ విక్రమ్, పంచాయతీ రాజ్ డిఈ, ఏఈ పిఆర్ అశోక్, జిల్లా ప్లాంటేషన్ అధికారి, సర్పంచులు, ఏపీఓ హరీష్
టెక్నికల్ అసిస్టెంట్లు,  పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.