అమరావతి బాండ్లులోకి అవినీతి సొమ్ము!

– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
కాకినాడ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : అవినీతి సొమ్మును అమరావతి బాండ్లులోకి మళ్లిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు  నాయుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కాకుండా… అబద్దాల పార్టీకి అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై అపవాదు వేసేందుకే  పెట్రోల్‌ రేటు రూ. 100కు పెంచుతారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టినవారిపై విచారణ జరపాలని సోమువీర్రాజు డిమాండ్‌ చేశారు. ఏపీలో పెట్రోల్‌ రేటును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారని అన్నారు.
————————————-

తాజావార్తలు