అమెరికా బ్రోకర్ల ఉచ్చులో తెలుగు విద్యార్థులు

అమెరికాలో ఎంఎస్‌ చేసి అక్కడే ఉద్యోగాలు పొంది బాగా సంపాదించాలనుకునే మధ్యతరగతి భారత విద్యార్థులు మోసాలకు గురి కావడం కేవలం అవగాహనా లోపం లేదా సమాచార లోపం కారణంగానే అని చెప్పక తప్పదు. బ్రోకర్ల బారిన పడి అనేకమంది విద్యార్థులు ఇటీవల ఫ్లైటు దిగగానే వెనక్కి వచ్చేశారు. వారిని కనసీం పౌరులుగా కూడా చూకుండా వచ్చిన దారినే వెనక్కి పంపారు. ఇదంతా కేవలం అక్కడ ఉన్న యూనివర్సిటీలపైనా, అక్కడి పరిస్థితులపైనా అవగాహన లేకపోవడం కారణంగా చెప్పుకోవాలి. ఇకపోతే గల్ఫ్‌ దేశాలకుపోయి మోసపోయినట్లుగానే ఏజెన్సీల ఉచ్చులో పడి వారు చెప్పింది నమ్మి వారే సర్వసం అనుకుని విద్యార్థులు మోసపోతున్నారు. అమెరికాలో నకిలీ విశ్వవిద్యాలయాల బారిన పడుతున్న వారిలో తెలుగు వాళ్లు అధికంగా ఉంటున్నట్టు వెల్లడైంది. అమెరికా హౌంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ ‘యూనివర్సిటీ ఆఫ్‌ నార్తన్‌ న్యూ జెర్సీ (యూఎన్‌ఎన్‌జే)’ అనే పేరుతో ఒక నకిలీ వర్సిటీని ఏర్పాటు చేయగా, అందులో చేరిన ప్రవాస విద్యార్థులలో ఎక్కువ మంది తెలుగు వాళ్లేనని తేలింది. విద్యార్థి వీసా కుంభకోణంలో భాగస్వాములైన వారిని పట్టుకునేందుకే ఇలా నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారని చెబుతున్నారు. నిజానికి ఇదొక స్టింగ్‌ ఆపరేషన్‌. ఈ యూనివర్సిటీలో దాదాపు వేయి మంది విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకోగా, వీరిలో అత్యధికులు భారత్‌, చైనా దేశాలకు చెందిన వారే. ఇక అరెస్టయిన ఏజెంట్లలో 10 మంది భారత్‌కు, 11 మంది చైనాకు చెందిన వారున్నారు. అమెరికాకు వలస వెళ్లాలనే మోజు తెలుగు వాళ్లలో ఎక్కువగా ఉంది. ఈ బలహీనతను ఉపయోగించు కొని ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. అమెరికాలో తాము ప్రవాసేతర ¬దా పొందడం కోసం విద్యార్థులు వీరికి బోలెడు డబ్బు చెల్లించారు. ఇలాంటి నకిలీ వర్సిటీని స్వయంగా ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తున్నారని మాత్రం వీరు కలలో కూడా ఊహించలేదని చెప్పారు.ఈ ఉదంతం అమెరికాకు వెళ్లాలనే కలలు గంటున్న విద్యార్థులకు కనువిప్పు వంటిది. వర్సిటీలను ఎంపిక చేసుకోవడంలో ఏమరపాటుగా ఉంటే, అమెరికా అధికారులు వారిని ఎప్పుడైనా పసిగట్టి వీసాలు రద్దు చేయవచ్చు. యూఎన్‌ఎన్‌జే విద్యార్థులను ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత వారిని తమ తమ దేశాలకు పంపించే అవకాశం ఉంది. నిజానికి అమెరికా ప్రబుత్వమే ఇలా బోగస్‌ వ్యవహారంతో నకిలీల గుట్టు రట్టు చేస్తోంది. ఓ రకంగా ఇదో స్టింగ్‌ ఆపరేషన్‌గా సాగుతోంది. దీంతో బోగస్‌ ఏజెట్లు వెంటనే పట్టుబడి పోతున్నారు. ప్రస్‌ఉతత పరిస్థితుల్లో అమెరికాలో ఎంఎస్‌ చేయాలనుకునే వారికి పరిస్థితులు అంతగా సానుకూలంగా లేవు. అక్కడ పార్ట్‌ టామ్‌ జాబ్స్‌పైనా ఆంక్షలు పెట్టారు. దీంతో అక్కడికి వెల్ల ఇచదువుకుని, ఉద్యోగాలు వెతక్కోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా కాకుండా గల్ఫ్‌ వెల్లాలనుకున్న వారికి ప్రభుత్వమే సంస్థలను ఒకటి తెలంగాణలో ప్రారంభించింది. అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునే వరాఉ ఈ సంస్థ ద్వారా వెల్లితే సేఫ్‌గా ఉంటుంది. అలా అమెరికా చదువులపై స్పష్టత ఇచ్చేలా ప్రభుత్వమే సంస్థను ఏర్పాటు చేసి, అందులో సమస్య  సమాచారాన్ని పెడితే మంచిది. ఇందుకు కేంద్రం కృషి చేస్తే బాగుంటుంది. ఇక పోతే ప్రైవేట్‌ విద్యాసంస్థలల్లో ఫృజుల భయం వెన్నాడుతున్న సమయంలో కేంద్రం ఐఐటిల్లో భారీగా ఫీజలుఉల పెంచడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారనుంది. ఫీజులు త్‌ట్టుకోలేక ఉన్నత సంస్థల్లో చదువు మానేసే పరిస్థితి రావచ్చు. ప్రస్థుత ఫీజుల పెంపుతో ఇంజినీరింగ్‌ చదివేందుకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సీటు లభించినా వాటిల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకాడే పరిస్థితి రాబోతుంది. ఐఐటీల్లో ట్యూషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర

మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం విద్యను ఖరీతు చేయడం తప్ప మరోటి కాదు. ఏకంగా ఫీజును రూ.90వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచేందుకు నిర్ణయించారు. సాధారణంగా 20 నుంచి 25 శాతం పెంచుతారు. కానీ కేంద్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించి భారీగా ఫీజుల్ని పెంచేసింది. త్వరలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల్లోనూ ఫీజులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటీలకు ప్రతేక గుర్తింపు ఉంది. వీటిలో ఫీజు అన్నివర్గాల వారికీ అందుబాటులో ఉండాలి. అయితే ఇందుకు భిన్నంగా ఫీజుల్ని పెంచేయడం ఎంతవరకు సబబో ఆలోచనచేయాలి. దీనివల్ల ప్రైవేట్‌కుప్రభుత్వానికి తేడా లేకుండా పోతోంది.   పాఠశాల విద్య నుంచే ముఖ్యంగా ఆరో తరగతి నుంచి ఐఐటిల్లో సీటు సాధన కోసం తల్లిదండ్రులు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందుకు ఆరు నుంచి ఇంటర్‌ వరకు ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు సుమారు ఐదారు లక్షల రూపాయల వరకు వ్యయం చేస్తున్నారు. వీటికి బస, సదుపాయాల ఫీజులు అదనం. ఈ పరిస్థితుల్లో ఐఐటీల్లో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులకు ఆర్థికంగా మరింత భారం కానున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి సీటు సాధించినప్పటికీ పిల్లలకు ఇచ్చే గుర్తింపు ఇదేనా? అన్నది కేంద్రం ఆలోచన చేయాలి. అటు అమెరికా చదువుల భారంగా మారి, ఇటు దీశీయంగా ప్రభుత్వం ఆధీనంని చదువులు భారంగా మారితే ఇక ఉన్నత విద్యావంతుడయ్యే వారు తమ ఉద్యోగాల్లో నిజాయితీగా ఎలా ఉంటారన్నది ముఖ్యం. చదువును కొనుక్కునేలా చేసే ఆలోచనలు  మారాలి.