అమ్మవారికి ఒడిబియ్యం న్సమర్పించిన పద్మశాలి ఆడబిడ్డలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 08. సిరిసిల్ల పట్టణం లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. శనివారం పద్మశాలి సంఘం అధ్యక్షులు గోల వెంకట రమణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పద్మశాలి ఆడపడుచులు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి ఓడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఆడబిడ్డలుగా ఒడి బియ్యం అందించే సాంప్రదాయం తరతరాలుగా వస్తుందని పద్మశాలి కులస్తులు కోడి బియ్యం సమర్పించడం జరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్లు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బొల్లి రామ్మోహన్ ,పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కామని వనిత. గుండ్లపల్లి పూర్ణచందర్, పత్తిపాక పద్మ. తదితరులు పాల్గొన్నారు.