అమ్మవారి ఆలయ సందర్శన ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఎల్ బి నగర్ నియోజకవర్గం, మన్సూరబాద్ డివిజన్ పరిధిలోని చంద్రపురి కాలని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు హరిప్రసాద్,ఏ వీ ఆర్ ప్రసాద్ యశ్వంత్ రెడ్డి,నవీన్ రెడ్డి, జి.రాజశేఖర్ రెడ్డి, అర్చన,హర్పిత,నాగరాజు తెరాస డివిజన్ నాయకులు, కాలని వాసులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.