అర్జీ పెట్టుకున్న ఆన్లైన్ లో కానరాని అర్జిదారుని పేర్లు
గంగారం అక్టోబర్ 13 (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించడం కోసం పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూముల వివరాలను సేకరించాల్సిందిగా సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు పోడు భూముల రికార్డుల అర్జీలను పోడు సాగు చేసుకుంటున్నా రైతుల నుండి దరఖాస్తు స్వీకరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగినది సాగు చేసుకునే రైతులు అర్జీలు ఇచ్చినప్పటికీ ఆన్లైన్లో పేర్లు రాకపోవడంతో అర్జీ పెట్టుకున్న రైతులు ఏం చేయాలో అయోమయంలో ఉన్నారు ఆన్లైన్ చేసిన రైతుల పేర్లు కొంతమందివి తప్పుగా పడడంతో వారు సంబంధిత అధికారులను అడగగా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రైతులకు ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారని కలెక్టర్ దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులతో రైతులకు న్యాయం చేయాలని కోరారు