అర్జున్ ముండా రాజీనామా
అసెంబ్లీ రద్దుకు సిఫార్సు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : శిబూసోరెన్
రాంచి, జనవరి 8 (జనంసాక్షి):
జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ అత్యవసర భేటీ అనంతరం ఆయన నేరుగా గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు. జార్ఖండ్ ముక్తిమోర్చా నేత శిబుసోరెన్ బిజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహ రించుకోవడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముండా రాజీనామా చేసిన అనంతరం శిబుసోరెన్ విలేకరులతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీకి జెఎంఎంకు చెందిన ఐదుగురు మంత్రులు హాజరుకాలేదు. అయితే కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలాల్సి ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని బీజేపీ, జెఎంఎం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 28 నెలలు ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదట బీజేపీ పగ్గాలు చేపట్టింది ప్రభుత్వం గడువు ఈ నెల 10వ తేదీతో ముగియడంతో శిబుసోరెన్ తన మద్దతు ఉపసంహరించుకున్నారు. 82 సీట్లు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 18 స్థానాలున్న బీజేపీ, జెఎంఎం, ఏజెఎస్‌యూ(6), జేడీయూ(2), ఇద్దరు స్వతంత్రుల అర్జున్‌ముండా రాజీనామా
జార్ఖండ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: శిబుసోరెన్
రాంచి, జనవరి 8 : జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ అత్యవసర భేటీ అనంతరం ఆయన నేరుగా గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ను కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు. జార్ఖండ్ ముక్తిమోర్చా నేత శిబుసోరెన్ బిజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముండా రాజీనామా చేసిన అనంతరం శిబుసోరెన్ విలేకరులతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీకి జెఎంఎంకు చెందిన ఐదుగురు మంత్రులు హాజరుకాలేదు. అయితే కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలాల్సి ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని బీజేపీ, జెఎంఎం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 28 నెలలు ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదట బీజేపీ పగ్గాలు చేపట్టింది ప్రభుత్వం గడువు ఈ నెల 10వ తేదీతో ముగియడంతో శిబుసోరెన్ తన మద్దతు ఉపసంహరించుకున్నారు. 82 సీట్లు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 18 స్థానాలున్న బీజేపీ, జెఎంఎం, ఏజెఎస్‌యూ(6), జేడీయూ(2), ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. అలాగే కాంగ్రెస్‌కు 13, జేవీఎంకు 11, ఆర్జేడీకి 5 స్థానాలున్నాయి. 12 ఏళ్ల జార్ఖండ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 9 ప్రభుత్వాలు మారాయి.
మిగతా 2లో