అర్ధాంతరంగా నిలిచిపోయిన డబల్ బెడ్ రూమ్ లాపనులు !

  జయశంకర్ భూపాలపల్లి  ప్రతినిధి )జులై 18( జనం సాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం  కేంద్రంలో నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ల పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సింది పోయి గత ఆరు నెలల క్రితం ఈ పనులు నిలిచిపోయాయి అని గ్రామస్తులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పనులు. కాంట్రాక్టర్ గత ఆరు నెలల క్రితం వదిలేసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. డబల్ బెడ్ రూమ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత పోయి. ప్రభుత్వము, మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు అటువైపు తొంగి చూసిన వారే లేరని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు చొరవ తీసుకొని సంబంధిత పనులను వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు. అలాగే మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో కూడా ఇదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ల పనులు కూడా  నిలిచిపోయాయని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇంజనీరింగ్ ,అధికారులు ప్రజా ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గిరిజన శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ , జిల్లా కలెక్టర్ చొరవ తీసు కొని డబల్ బెడ్ రూమ్ పనులు చేపట్టాలని గాంధీనగర్, గణపురం గ్రామాలలో గల నిరుపేదల కొరకు చేపడుతున్న డబల్ బెడ్ రూమ్ పనులనుపూర్తి చేయించి పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని  గ్రామస్తులు కోరుతున్నారు.