అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

 జెరిపోతుల కుమార్..
జనగామ కలెక్టరేట్ జూలై 8(జనం సాక్షి): ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ జేరిపోతుల కుమార్ శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశములో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2022- 24వ సంవత్సరాల గాను అర్హులైన విలేకరులు కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలుపగా వర్కింగ్ జర్నలిస్ట్ లు అందరూ దరఖాస్తు చేసుకున్నారని, కానీ అక్రిడేషన్ కమిటీల సరైన నిర్ణయం లేక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విలేకరులను పూర్తిస్థాయిలో గుర్తించక అక్రిడేషన్ కార్డులు రాకుండా చేయడం వల్ల  అన్యాయం జరుగుతుందని వారు అన్నారు.డిపిఆర్ఓ కమిటీలో కొందరి మాటలు విని అర్హులైనజర్నలిస్టులను గుర్తించకుండా వారికి రావలసిన కార్డులు అందకుండా చేస్తున్నారని అన్నారు  ఇప్పటికైనా కలెక్టర్. డీపీఆర్వో స్పందించి అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఇవ్వకుంటే ఉధృతంగా ఉద్యమం చేస్తామని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ జేరిపోతుల కుమార్ అన్నారు.

తాజావార్తలు