అలీఘర్‌లో ఘోరం ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

బంధువుల ఆందోళన
పోలీసుల లాఠీచార్జి, ఉద్రిక్తత
అలీఘర్‌, (జనంసాక్షి) :
కామాంధుల అకృత్యానికి పసిమొగ్గ రాలిపోయింది. అభంశుభం తెలియని ఐదేళ్ల బాలికపై అమానవీయంగా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు దుండగులు. ఈ దురాగతం అలీఘర్‌లో చోటు చేసుకుంది. గురువారం ఉదయం నాగ్లాకలార్‌ ప్రాంతంలో ఓ బాలిక కనిపించకుండాపోయింది. కొంత సేపటి తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ చెత్తకుప్పలో స్థానికులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈక్రమంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రజల ఆందోళనతో దిగివచ్చిన లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఈ ఘటనపై మూడు రోజుల్లో ఘటనపై నివేదిక సమర్పించాలని అలీఘర్‌ డీఐజీ ప్రకాశ్‌ను ఆదేశించారు.

తాజావార్తలు