‘అల్లుడి’ అరెస్టు

ముంబయి పోలీసు కస్టడీకి విందూ దారాసింగ్‌
ముంబయి, మే 24 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అల్లుడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో గురునాథ్‌ మయ్యప్పన్‌ శుక్రవారం రాత్రి అరస్టయ్యాడు. ముంబయి పోలీసులు అతడిని అరెస్టు చేసి నాలుగు గంటలకు పైగా ప్రశ్నించారు. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన బాలీవుడ్‌ నటుడు విందూ దారాసింగ్‌తో అతడినికి ఉన్న సంబంధాల నేపథ్యంలో గురునాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఫిక్సింగ్‌కు ఏమైన సంబంధాలున్నాయా? బుకీలతో పరిచాలు ఉన్నాయా? అనే విషయమై ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటికే అరెస్ట్‌ అయిన జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న నటుడు విందూ దారాసింగ్‌ను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, అతడిని కస్టడీకి అప్పగించింది. అల్లుడి అరెస్టు నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌ శ్రీనివాసన్‌ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌ ఊపందుకుంది