అవతరణోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

అటు సింగరేణి, ఇటు అధికార యంత్రాంగం బిజీ 
భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఓవైపు సింగరేణి, మరోవైపు జిల్లా అధికా యంత్రాంగ్‌ ర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు  చేయడంతో పట్టణం సుందరంగా కనిపించేలా చేస్తున్నారు.జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విద్యుత్‌ దీపాలు అలంకరిస్తున్నామన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోనూ పతాక ఆవిష్కరణ చేపట్టాలని సూచించామన్నారు. సింగరేణి సంస్థలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి  వేడుకల కన్వీనర్‌ మసూద్‌ ముజాహిద్‌ అన్నారు.  రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.  ప్రముఖ సీని, టీవీ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. సినీ గాయకులు సింహా, కీర్తన టీమ్‌తో సినీ మ్యూజికల్‌ నైట్‌, ఈటీవీ జబర్దస్త్‌ ఫేమ్‌ చమ్మక్‌చంద్ర, తాగుబోతు రాజమౌళిల హాస్యవల్లరి, ప్రముఖ మిమిక్రీ నాగిరెడ్డి ప్రదర్శన, ఫోర్‌లెగ్స్‌ ఫేమ్‌ కిరణ్‌ డాన్స్‌, శ్రీనివాస్‌ బృందంచే కామెడి ప్రదర్శనలు, సత్య టీమ్‌చే మషుప్‌ సాంగ్స్‌, ప్రముఖ శాస్త్రీయ నత్య కళాకారిణి సీతాప్రసాద్‌ బృందంతో క్లాసికల్‌ డాన్స్‌ కార్యక్రమాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రముఖ యాంకర్‌ పూజిత పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి సింగరేణీయులు, పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, సింగరేణీయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.  గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ భవనాలన్నింటినీ విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. కొత్తగూడెంలో అమరవీరుల స్థూపాన్ని అలంకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి రంగులు వేయించాలని సూచించారు. ప్రగతి మైదాన్‌లో స్టాళ్ల ఏర్పాట్లు, సభావేదిక ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను డీపీఆర్వో, డీఈవో సంయుక్తంగా నిర్వహించాలన్నారు.