అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు

భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అత్యంత ఘనమైన రీతిలో వేడుకలు నిర్వహించడంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రగతిమైదాన్‌, సింగరేణి ఆధ్వర్యంలో స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలను ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అటు సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసాయి. సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో జరగనున్న వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. సింగరేణి అధికారులుదగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతిమైదాన్‌లో జరగనున్న వేడుకలకు మంత్రితోపాటు శాసన సభ్యులు, ఎమ్మెల్సీ, ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అవతరణ వేడుకలకు వచ్చే వారికి సౌకర్యవంతమైన రీతిలో ఏర్పాట్లు చేసారు. /ూష్ట్ర అవతరణ వేడుకల్లో అధికారులకు కేటాయించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేలా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి 8:30 గంటలకు బస్టాండ్‌ సవిూపంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోవాలని అన్నారు. తరువాత సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌, ఎన్‌సీసీ, స్కౌట్స్‌తో గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై ప్రసంగించనున్నారు. ఆ తరువాత వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని జాబితా ఆధారంగా నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. అలాగే సాయంత్రం ఆరు గంటలకు బస్టాండ్‌ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున కాండీల్స్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కళాకారులు వివిధ కళారూపాలతో ప్రగతిమైదాన్‌కి చేరుకొని తమ ఆటపాటలతో వివిధ కళాప్రదర్శనలు నిర్వహిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తరువాత జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే తెలంగాణా ఆవిర్బావ దినోత్సవాన్ని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణా గ్రావిూణాభివృద్ది ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు అన్నారు. జిల్లాలో పనిచేసే గ్రావిూణాభివృద్ది ఉద్యోగులు తెలంగాణా ఆవిర్బావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.