అవినీతి ప్రజాస్వామ్యానికి ముప్పు

సీబీఐ స్వర్ణోత్సవ సభలో రాష్ట్రపతి ప్రణబ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి): దేశ ప్రజా స్వామ్య వ్యవస్థకు అవినీతి ముప్పులా పరిణ మించిందని, సమానత్వం సాధించేందుకు జరు గుతున్న ప్రయత్నాలకు అవరోధంగా నిలు స్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. సిబిఐ స్వర్ణోత్సవాల సందర్భంగా శనివారం  ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో 14వ డిపికొహ్లి స్మారకోపన్యాసం చేశారు. డిపి కొహ్లి సిబిఐ వ్యవస్థాపకుడిగా 1963 నుంచి 68 వరకు ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ మాట్లాడుతూ చట్టబద్ధ సంస్థలు ఆరోపణలపై దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఆరోగ్య రక్షణ మరింత అందుబాటు లోకి వచ్చేలా ప్రభుత్వం పనిచేయాలన్నారు. ప్రస్తుతం దేశం నాలుగురోడ్ల కూడలిలో ఉంది. సుపరిపాలన యొక్క మౌలిక నియమాలు మన జాతి నేతలు ఇప్పటికే రాజ్యాంగంలో పొం దుపరిచారని ఆయన చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలతో అలరారే విధంగా విధానాలను రూపొందించి అమలు చేయడమే సుపరిపాలనకు అర్థమని రాష్ట్రపతి  ఉద్ఘాటించారు. సుపరిపాలన అందించడమే మన తిరిగులేని లక్ష్యంగా ఉండా లన్నారు. ఆరోపణలపై చట్టబద్ధమైన సంస్థలు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భారత్‌ అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ మరింత సమర్థంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. విధానాల నిర్ణయాలలో భాగస్వా మ్యాన్ని పెంపొందించే అవకాశం ఉందన్నారు. ఇంకా ఇప్పటికీ 30శాతం దారిద్య్రం తాండ విస్తుందన్నారు. అందరికీ ఆరోగ్యం అందిం చడమే ప్రాధాన్యం కావాలన్నారు. ఎంతోమంది ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని, వైద్య ఖర్చులతో మరింత పేదవారు అవుతున్నారని అన్నారు.