అశ్వరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

శాంతి భద్రత లే లక్ష్యంగా పోలీసులు
– ఎస్సై బి రాజేష్ కుమార్
అశ్వరావుపేట ఆగస్టు 22( జనం సాక్షి )

 

సమాజం, భవిష్యత్తు తరాలు ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రత లక్ష్యంగా పెట్టుకుంటారని అశ్వరావుపేట ఎస్సై బి రాజేష్ కుమార్ అన్నారు. శనివారం అశ్వరావుపేట పోలీస్ ల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ఈ సందర్భంగా యువకులు రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.