అసలు దోషి బీజేపీయే…

` బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడిరదే ఆ పార్టీయే..
` హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు
` మండిపడ్డ కూనంనేని
హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల అంశంలో అసుల దోషి బిజెపి అని సిపిఐ ఆరోపించింది. ఈ బిల్లును తొక్కి పెట్టడంలో బిజెపి పాత్ర ఉందన్నారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా, భారత రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వారికి కనీసం బాధ కూడా లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వంపై ద్వేషమా.. బీసీలపై ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకన్నారు. బీసీ బిల్లుకు మేం మద్దతిచ్చాం.. కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యాం. విూరెందుకు కాలేదని కూనంనేని ప్రశ్నించారు. సుప్రీంలో 50శాతం దాటొద్దని తీర్పు ఉంది. 9వ షెడ్యూల్‌లో పెట్టడం ద్వారా తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నా చేయడం లేదు. దీనికి బాధ్యత మొత్తం భాజపా పైనే ఉందన్నారు. కానీ డొంకతిరుగుడు రాజకీయాలతో ప్రజలను పార్టీ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారని కూనంనేని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి భాజపా.. వాళ్లకు మద్దతిస్తోంది భారత రాష్ట్ర సమితి. అన్ని పార్టీల నేతలను దిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. అవసరమైతే.. అన్ని పార్టీలతో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాటు చేయాలన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ముందడుగు పడుతుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. అలాగే బిజెపి నయవంతచక రాజకీయాలను ఎండగట్టాల్సి ఉందన్నారు.