ఆండీస్ పర్వత శ్రేణుల్లో ‘మస్తాన్’ మృతదేహం

హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో విగతజీవిగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత మస్తాన్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 2006లో 172 రోజుల వ్యవధిలో 7 పర్వతాలను అధిరోహించిన మస్తాన్ బాబు గత నెల 24 నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.