ఆంద్రాలో ఉన్న ఐదు పంచాయితీ లను తెలంగాణ లో కలపాలని సిపిఐ డిమాండ్

ఆంద్రాలో ఉన్న  5 పంచాయితీ లను  తెలంగాణ లో  కలపాలి
 ఇద్దరు సి ఎం లు  ఏకాభిప్రాయం తో  ప్రధాని కి విన్నపంచాలి
    సీపీఐ  జిల్లా  కార్యదర్శి  ṡҡ  సాబీర్ పాషా
పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): భద్రాచలం  పరిసర ఐదు గ్రామ పంచాయితీ లను ప్రజా అభిష్టం కు విరుద్ధంగా    కేంద్ర ప్రభుత్వం  ఆంధ్ర రాష్టం లో కలపటం వల్ల  భద్రాద్రి కి పెనుముప్పు గా  మారిందని ఐదు గ్రామపంచాయతీ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని. సిపిఐ జిల్లా  కార్యదర్శి ఎస్ కె  సాబీర్ పాషా  పేర్కొన్నారు.మణుగూరు సీపీఐ కార్యాలయంలో నరాటి ప్రసాద్  అద్యక్షతన గురువారం జరిగిన  జిల్లా కార్యవర్గసభ్యుల సమావేశం  సమావేశం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య చారి, జిల్లా కార్యదర్శి  సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు  గోదావరి పరివాహక ప్రాంతాల్లో  భవిష్యత్ లో జరగబోవు  నష్ట నివారణ కోసం  తక్షణం నిధులు మంజూరి చేసి   పినపాక , చర్ల  మండలాల నుంచి  బూర్గంపాడు వరకు గోదావరికీ రెండు వైపులా  కరకట్ట నిర్మించాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు రైతాంగానికి జరిగిన  నష్టం పై సత్వరం  సర్వ్ చేసి  నష్ట పరిహారం  అందించాలి.  ఇండ్లు కోల్పోయిన వారికీ   కాలనీ ఇండ్లు మంజూరు చెయ్యాలన్నారు.జిల్లాలో పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని పారెస్ట్ అధికారులు అక్రమ అరెస్టులు భూ ఆక్రమణలు నిలిపివేయాలని కోరారు.
 ధరణిలో లోపాలు సరిచేసి  పాస్ బుక్  లు రాని వారికీ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవలన  వచ్చిన గోదావరి వరదలు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎక్కువ గ్రామాలు కు తీవ్ర నష్టం జరిగిందన్నారు  ఐదు గ్రామ పంచాయతీ లను  తక్షణం తెలంగాణలో కలపాలి  ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు  ఏకతాటిపై కి వచ్చి  ప్రధానితో  మాట్లాడి సరైనా నిర్ణయం తీసుకోవాలన్నారు.ఈ  సమావేశం లో  సిపిఐ  రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు  బొల్లోజు అయోధ్య . రావులపల్లి  రాం  ప్రసాద్  . ముత్యాల విశ్వనాధం . బందెల నర్సయ్య , పూలారెడ్డి . గుత్తుల సత్యనారాయణ . మున్నా లక్ష్మి కుమారి , సారయ్య , కల్లూరు వెంకటేశ్వర్లు .ఎస్ డి సలీం , ఏపూరి బ్రమ్మమ్ . తమ్మల వెంకటేశ్వర్లు కామఠం  వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.
Attachments area