ఆంధ్రా ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్
విజయవాడ,అగస్టు9(జనంసాక్షి): ఆంధ్రా ఆస్పత్రిలో డాక్టర్లు అరుదైన పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో 15 ఏల్ల బాలుడికి వచ్చిన సమస్యను తీర్చారు. నాగ వెంకట అర్జున్ అనే 15 ఏళ్ల బాలుడికి గుండె సంబంధిత వ్యాధి వచ్చింది. దీంతో ఈ నెల 4 న ఓజాకీ అనే అరుదైన పద్ధతి ద్వారా డా. దిలీప్ బృహద్ధమని కవాటాన్ని అమర్చారు. తెలుగు రాష్టాల్ల్రో మొదటి సారిగా ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు ఆంధ్రా హాస్పటల్ వైద్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రా ఆసుపత్రి డాక్టర్ రామారావు మాట్లాడుతూ బాలుడికి గుండెలోకి రక్త ప్రసరణ కాకుండా కవాటాలు మూసుకుపోయాయన్నారు. అరుదుగా వచ్చే ఈ అనారోగ్యంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతా యన్నారు. పిల్లలలో కవాటం మూసుకుపోయినప్పుడు బెలూన్ ద్వారా పెద్దది చేయటం.. కొంత కాలం తరువాత శస్త్ర చికిత్స నుంచి ఉపశమనం లభిస్తుందని డా. రామారావు తెలిపారు.