ఆకట్టుకున్న బయోడైవర్సిటీ రన్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): నెక్లెస్‌రోడ్డులో ఆదివారంనాటి పరుగు అందర్నీ ఆకట్టుకుంది. బయో డైవర్శిటీ రన్‌ను మంత్రి దానం నాగేందర్ ప్రారంభించారు. చిన్నా, పెద్దా సైతం అందరూ పాల్గొనడంతో నగరవాసులను అమితంగా అలరించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించేందుకుగాను ఆదివారంనాడు పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు పరుగు సాగింది. ఈ పరుగులో మంత్రి దానం నాగేందర్, క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు వరుణ్‌సందేశ్, ప్రముఖ నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.