ఆకాశంలో సగం..ఇక యుద్ధరంగంలో కూడా సగం

2

– ఏయిర్‌ ఫోర్స్‌లో ఫౖౖెటర్‌ పైలెట్లుగా ముగ్గురు మహిళలు

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో శనివారం భారత ఎయిర్‌ ఫోర్స్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని చెతుర్వేది(మధ్యప్రదేశ్‌), మోహనా సింగ్‌(రాజస్థాన్‌), భావనా కాంత్‌(బిహార్‌) రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేతుల విూదుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత ఎయిర్‌ ఫోర్‌స్లో తొలిసారిగా యుద్ధ విమానాలను  మహిళలు నడపనున్నారు. దీంతో తొలిసారి దేశంలో యుద్ధవిమాన పైలట్లుగా ముగ్గురు మహిళలు శనివారం అధికారికంగా వైమానికదళంలోకి ప్రవేశించినట్లు అయ్యింది.  జెట్‌ పైలట్లుగా శిక్షణ పొందిన భావనా కాంత్‌, అవని చతుర్వేది, మోహనా సింగ్‌లు కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆధ్వర్యంలో వాయుసేనలో చేరారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో వీరి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ అకాడవిూలో శిక్షణ పూర్తిచేసుకున్న 130 మంది పైలట్లలో 22 మంది మహిళలు ఉన్నారు. వీరు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ అనంతరం పారికర్‌ చేతుల విూదుగా బాధ్యతలు తీసుకున్నారు.దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్యఅతిథిగా హాజరై వైమానికదళ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను వీక్షించారు.తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా అవని చతుర్వేది, మోహనాసింగ్‌, భావనాకాంత్‌ శిక్షణ పొందారు. రక్షణ మంత్రి పారికర్‌ చేతులవిూదుగా పైలట్లు బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడవిూలో శిక్షణ పూర్తి చేసుకున్న 130 మంది పైలట్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో పారికర్‌ పాల్గొన్నారు. యుద్ధ విమాన పైలట్లుగా మహిళలను నియమించే విషయంలో దేశంలో ఎంతో కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ ముగ్గురు మహిళా ఫైటర్‌ పైలట్లు మొదటి దశ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా 150 ఫ్లయింగ్‌ అవర్స్‌ పూర్తయ్యాయి. ఈరోజు అధికారులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో ఆరు నెలల పాటు అడ్వాన్స్‌డ్‌ జెట్‌ ఫైటర్స్‌లో శిక్షణ పొందనున్నారు. 2017లో ఈ ముగ్గురు పూర్తిస్థాయిలో ఫైటర్‌ జెట్‌ కాక్‌పిట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే వారు ఎన్నో రకాల అడ్డంకులను విజయవంతంగా ఎదుర్కొన్నారని ఎయిర్‌చీఫ్‌ అరూప్‌ రహా తెలిపారు. భావనాకాంత్‌ – బిహార్‌లోని దర్భంగా నుంచి వచ్చారు. ఆమె తండ్రి బెగుసరాయ్‌లోని బరౌనీ రిఫనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. భావన బిహార్‌లో పాఠశాల చదువు పూర్తిచేశారు. బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీఈ(మెడికల్‌ ఎలక్టాన్రిక్స్‌) పూర్తి చేశారు. సాహస క్రీడలంటే ఇష్టపడే భావన పైలట్‌ కావాలనే ఆశయంతో వైమానిక దళంలో చేరారు. పవని చతుర్వేది- మధ్యప్రదేశ్‌లోని సాత్నా నుంచి వచ్చారు. ఆమె తండ్రి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌. తల్లి గృహిణి. రేవాలో స్కూలింగ్‌ పూర్తిచేశారు. జైపూర్‌లోని బనస్థలి యూనివర్సిటీలో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశారు. వయోలిన్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఇష్టపడే అవని తన కుటుంబంలోని కొందరు ఆర్మీ అధికారులను చూసి ఐఏఎఫ్‌లో చేరారు. రోహనాసింగ్‌- ఈ పైలట్‌ రాజస్థాన్‌లోని ఝున్‌ఝును ప్రాంతానికి చెందినవారు. ఆమె తండ్రి కూడా భారత వైమానిక దళంలో పనిచేస్తున్నారు. తల్లి ఉపాధ్యాయురాలు. ఆమె దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ స్కూల్లో పాఠశాల చదువు పూర్తిచేశారు. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని జీఐఎంఈటీ నుంచి బీటెక్‌( ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) పూర్తిచేశారు. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లోనే పనిచేస్తున్నందున మోహనా కూడా ఐఏఎఫ్‌లో చేరాలనే కోరికతో ఇందులో చేరారు. మహిళా పైలట్లను మనోహన్‌ పారికర్‌ ఈ సందర్బంగా అభినందించారు.