42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం

సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ అంశం హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండిరగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ దవే, అభిషేక్‌ సింఫ్వీు, ఏడీఎన్‌ రావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్‌ పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం కొట్టివేసిందివసంది. దీంతో బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్‌ రిలీఫ్‌ లభించింది. అంతేగాకుండా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ని విచారించడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండిరగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. హైకోర్టులో పిటిషన్లు పెండిరగ్‌లో ఉన్నందున… విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 32 కింద దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది ధర్మాసనం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జీవో నెంబర్‌` 9ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. వీరు సీనియర్‌ న్యాయవాదులతో ఆదివారం నుంచి మంతనాలు జరిపారు. ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని కోరారు. దీంతో ఇక ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు దాదాపుగా మార్గం సుగమమయ్యిందని భావిస్తున్నారు.