సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం
` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం
న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును న్యాయస్థానం కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం.. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్‌ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం.. 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం.. ఈ రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం.. మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు గట్టిగా వినిపించారన్నారు. అంతకు ముందు మాట్లాడుతూ…బీసీ రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించవచ్చన్నారు. సిపెక్‌ సర్వే ద్వారా సమగ్రమైన జన గణన వివరాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడిరచారు. రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాగా.. బీసీ రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టులో జరిగే వాదనలు సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకాటి శ్రీహరి కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట వ్యాప్తంగా ఇంటికి ఇంటికి సర్వే నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. సబ్‌ కమిటీ ద్వారా సవిూక్షించి క్యాబినెట్‌ అనుమతి తీసుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని రాజకీయాల పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో చట్టాన్ని గవర్నర్‌కు పంపించామని తెలిపారు. గవర్నర్‌ రాష్ట్రపతికి పంపించారన్నారు. అయితే దీనిపై కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు.రాష్ట హైకోర్టులో వాదనలు జరిగాయని.. ఎన్నికల నోటిఫికేషన్‌కు వెళ్లొచ్చని చెప్పారని మంత్రి వెల్లడిరచారు. హైకోర్టులో ఈకేసుపై 8వ తేదీ విచారణ జరగాల్సి ఉందని.. ఈ లోపే వారు సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఢల్లీి వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. సుప్రీంలో కేసు ఉన్నందున ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్‌, వాకాటి శ్రీహరి నిన్న రాత్రి ఢల్లీి చేరుకున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని పిటిషన్‌ వేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో వంగ గోపాల్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్‌ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని పిటిషిన్‌ దాఖలైంది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ ధర్మాసనం ముందు కేసు విచారణకు రాగా పిటిషన్‌ను ధర్మాసనం విచారించేందుకు తిరస్కరించింది. దీంతో మంత్రులు సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు.
ఎంఐఎం మద్దతు మాకే..
` జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయం మాదే
` సుప్రీంతీర్పు శుభపరిణామం
` 42 శాతం రిజర్వేషన్లకు ఢోకా లేదు
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి) :టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌తోనే ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు మద్దతు ఇస్తుందని తెలిపారు. కంటోన్మెంట్‌ మాదిరిగా జూబ్లీహిల్స్‌లోనూ విజయం తమదేనంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ టికెట్‌ బీసీకి వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థి పేరు ఖరారవుతుందని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితులను బట్టి మిత్రపక్షాలకు టికెట్లు ఇస్తామన్నారు. సీపీఎం, సీపీఐ, జనసమితి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్‌ చివరి నాటికి పార్టీ పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తాము ముందుగా ఊహించిందేనన్నారు. త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్‌ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని తెలిపారు. 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్‌ గౌడ్‌ కోరారు.సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి డాక్టర్‌ కొనగాల మహేష్‌ అన్నారు. బీసీ బిడ్డలకు కాంగ్రెస్‌ రిజర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్‌ చిత్తశుద్దిగా ఉందన్నారు. బీజేపీ బీఆర్‌ఎస్‌లు చేస్తున్న కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలని అన్నారు. బీసీ బిడ్డల నోటి దగ్గర ముద్దను లాక్కోవద్దని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ నేతలు కుల సంఘ నాయకుని ముద్ర వేసుకుని కోర్టుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఉత్సాహాన్ని బీసీలు గమనిస్తున్నారని మహేష్‌ పేర్కొన్నారు.