రియల్‌ ఎస్టేట్‌లో రాష్ట్రం దూసుకుపోతోంది

` హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
` నగరంలో అభివృద్ధి పనులకు ఏటా రూ.10వేల కోట్లు
` రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికింది
` బిల్డర్లు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి
` భవిష్యత్తులో హైదరాబాదులో అన్ని ఎలక్ట్రికల్‌ బస్సులే
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం హైటెక్స్లో జరిగిన నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్మెంట్‌ కౌన్సిల్‌ 15వ సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలోని ఏ రాష్ట్రంలో కనబడదు, స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తే ఆ రోజు పండుగ జరుపుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలది అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దట్టమైన అడవులు, వాటి లోపల ఉన్న జలపాతాలు, టైగర్‌ ఫారెస్ట్‌ లు ఉన్నాయన్నారు. హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు. రెండు సంవత్సరాల్లో 20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తున్నాయి, ఈ పనులు హైదరాబాద్‌ రూపురేఖలను మారుస్తాయి అన్నారు. ఇటీవల 39 ఎస్‌టీపీ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌ పనులకు ఆమోదం తెలిపారు.సీనరేజి ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు 11,927 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. 13,704 కోట్ల వ్యయంతో మరికొన్ని తాగునీటి, సీవరేజీ ప్లాంట్‌ పనులు ప్రతిపాదనలో ఉన్నాయని వివరించారు. మొత్తంగా సీవరేజీ, తాగునీటి సరఫరా కోసం 25,631 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ వేలంలో ఎకరం 177 కోట్లు పలికిందంటే హైదరాబాదులో రియల్‌ ఎస్టేట్‌ ఎంత వేగంగా దూసుకు వెళ్తుందో అర్థమవుతుంది అన్నారు. ఈ వేలము లో పాల్గొన్న 25 మంది బిల్డర్లు ఎకరాకు 150 కోట్ల వరకు ధరను కోట్‌ చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి నేషనల్‌ హైవేను కలుపుతూ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు 1,487 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ఢల్లీిలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్‌ మంత్రిని ఒప్పించి రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. షామీర్పేటలో 3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని వివరించారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్‌ నగరంలోనే జరుగుతుంది అన్నారు.గతంలో ఉన్న మంజీరా, గండిపేటకు తోడు గోదావరి నీళ్లు తరలిస్తున్నాము ఇవి నగర ప్రజలకు పరిశ్రమలకు పెద్ద ఆస్తి అన్నారు. హైదరాబాద్‌ నగరం లోని సరస్సులు, అందమైన రాతిగుట్టలు, పార్కులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలి అన్నారు. ప్రజా ప్రభుత్వం బిజినెస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. బిల్డ్‌ నౌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ ఏర్పాటుచేసి నిర్మాణ అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా పసుపు ఏర్పాట్లు చేసింది అన్నారు. హైదరాబాదులో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చే క్రమంలో డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకు వస్తున్న అన్నారు.భవిష్యత్తులో హైదరాబాద్‌ నగరంలో అన్ని ఎలక్ట్రికల్‌ బస్సులే ఉంటాయి అని తెలిపారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చాం అన్నారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అన్నారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాల 25 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం, ఇందుకుగాను 11,500 కోట్ల బడ్జెట్‌ కేటాయించి పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచాము అన్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నేరెడ్కో ప్రతినిధులు %జూR% నిధులను విద్య, వైద్యరంగంపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయండి, ఖర్చు చేసిన నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా సర్టిఫికెట్లు పొందండి అని సూచించారు. విల్లాలు, హై రైజ్‌ బిల్డింగులకే పరిమితం కావొద్దు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయండి అన్నారు. రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా గౌరవిస్తుంది. మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాదులో జరుగుతున్న అభివృద్ధిని ప్రాపర్టీ షో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్న నేరెడ్కో బృందానికి ముఖ్యమంత్రి లేబర్‌ రెడ్డి యావత్‌ క్యాబినెట్‌ పక్షాన అభినందనలు అని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో రియల్‌ ఎస్టేట్‌దే ప్రధాన పాత్ర
రియల్‌ ఎస్టేట్‌ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్‌ నిర్వంహించిన ‘’నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో’’ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధిలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల విస్తరణకు రియల్‌ ఎస్టేట్‌ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు.రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇటీవల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లభించడం పెట్టుబడిదారులు, రియల్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడిరచారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, నారెడ్కో ప్రెసిడెంట్‌ విజయ్‌ సాయి మేక, జనరల్‌ సెక్రటరీ శ్రీధర్‌ రెడ్డి, కిరణ్‌, నారేడ్కో నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పీఎస్‌ రెడ్డి, ఎం. వెంకయ్య చౌదరి, పి.రవిరెడ్డి, స్వామీనాథన్‌, కాళీప్రసాద్‌, వెంకటేష్‌, హరిబాబు, దశరథ్‌ రెడ్డి, కిరణ్‌ ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు.