భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ
` ముంబయిలో ఇరువురి సమావేశంలో
` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు
ముంబై(జనంసాక్షి):భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి కీలకమైన పునాదిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఇండియా-బ్రిటన్ సంబంధాలకు పునాది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలపై ఉన్న ఉమ్మడి నమ్మకమేనని తెలిపారు. ముంబయిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తో ఉన్నత స్థాయి చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, యూకే మధ్య అతిపెద్ద బిజినెస్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. వీటన్నింటితో పాటు ఇరుదేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి సూచనలు, అవకాశాలను పంచుకున్నాం. జులైలో నేను యూకే పర్యటన సందర్భంగా చరిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, రెండు దేశాలకు దిగుమతి ఖర్చు తగ్గుతుంది. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాణిజ్యం పెరుగుతుంది. ఈ ఒప్పందం భారత్?లోని పరిశ్రమలు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది నెలల్లోనే, ఇప్పటివరకు అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం యూకే ప్రధాని స్టార్మర్‌తో పాటు భారత్‌కు రావడం ఇరుదేశాల భాగస్వామ్యానికి నాందిగా నిలిచింది.’’అని ప్రధాని మోదీ అన్నారు
విద్యార్థులకు గుడ్ న్యూస్
యూకేకు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు భారత్?లో క్యాంపస్?లను ప్రారంభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం తాలుక గురుగ్రామ్ క్యాంపస్ ఇప్పటికే ప్రారంభమైందని, అక్కడ ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ‘‘భారత్-యూకే భాగస్వామ్యం విశ్వసనీయమైనది. ప్రతిభ, సాంకేతికత ఆధారితమైనది. యూకే ప్రధాని స్టార్మర్ నాయకత్వంలో భారత్, యూకే సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. భారత్, యూకే సహజ భాగస్వాములు. ప్రస్తుత ప్రపంచ అస్థిరత యుగంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఈ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి ఒక ముఖ్యమైన పునాది.’’ అని మోదీ తెలిపారు.‘‘ఈరోజు సమావేశంలో, మేము ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం, ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించాం. ఉక్రెయిన్- రష్యా యుద్ధం, గాజా సంఘర్షణ వంటి అంశాలపై చర్చించాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకేతో సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది. కీలకమైన ఖనిజాలపై సహకారం కోసం ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సైనిక శిక్షణలో సహకారంపై భారత్, యూకే ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత వైమానిక దళ ఫ్లయింగ్ బోధకులు యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షకులుగా పనిచేస్తారు. ‘‘అని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో ప్రధాని మోదీతో సమావేశం కావడం చాలా ముఖ్యమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. భారతదేశ వృద్ధి కథ చాలా అద్భుతమైనదని కొనియాడారు. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, ప్రధాని మోదీ నాయకత్వాన్ని తాను అభినందించాలనుకుంటున్నానని వెల్లడిరచారు. 2047 నాటికి భారత్?ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.‘‘భారత్ అభివృద్ధి ప్రయాణంలో యూకే భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది. నా సందర్శన ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం గురించే. అందుకే నేను నాతో పాటు రికార్డు స్థాయిలో 126 మంది బ్రిటిష్ ప్రతినిధుల బృందంతో భారత్?కు తీసుకొచ్చాను. మేము భారత్?తో కలిసి భవిష్యత్తుపై దృష్టి సారించాం. కొత్త ఆధునిక భాగస్వామ్యాన్ని సృష్టిస్తున్నాం. అందుకే ఈ ఏడాది జులైలో యూకే-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. రెండు గొప్ప దేశాలు మరింతగా కలిసి పనిచేస్తాయనే నమ్మకం, విశ్వాసం ఉంది.’’ అని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
స్టార్మర్ కు మోదీ స్వాగతం
రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ముంబయిలో ప్రధాని మోదీ-స్టార్మర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం రాజ్‌భవన్‌కు వచ్చిన యూకే ప్రధానికి మోదీ స్వాగతం పలికారు. ఈ క్రమంలో పలు అంశాలపై చర్చలు జరిపారు.
6.యుద్ధభూమిలో ఎగిరిన శాంతి కపోతం
` ఇజ్రాయెల్, హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందం
` ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయని ట్రంప్ వెల్లడి
` ట్రంప్ చొరవను స్వాగతించిన ప్రధాని మోడీ
వాషింగ్టన్(జనంసాక్షి):గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని, ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిరచారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది అద్దంపడుతోందన్నారు. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడటం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్` హమాస్ మధ్య యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 21 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. దానిని భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలు ఆహ్వానించాయి. తాజాగా ఆ దిశగా తొలి అడుగుపడిరదని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిరచారు. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా ఉంది. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్నవారంతా త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని ప్రకటించారు. అలాగే సోమవారం బందీలు విడుదల కావొచ్చని చెప్పారు. అలాగే ఈ విషయంపై ఫోన్ కాల్‌లో ట్రంప్ మాట్లాడుతుంటే బందీల కుటుంబాలు ఆసక్తిగా వింటున్నట్లు ఉన్న ఒక వీడియోను వైట్‌హౌస్ పోస్ట్ చేసింది. శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధ్రువీకరించింది. గాజాలో యుద్దానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాల పూర్తి ఉపసంహరణ, మానవత సాయానికి అనుమతి, ఖైదీల మార్పిడి చోటుచేసుకోనుందని వెల్లడిరచింది. ఈ ఒప్పందం వేళ.. రష్యా స్పందించింది. ట్రంప్ అత్యున్నత ప్రతిపాదనలను చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అభివర్ణించారు. ఒప్పందంలో నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని, గాజాలోకి అన్నిరకాల నిత్యావసరాల సరఫరాలను కొనసాగించాలని ఐరాస పేర్కొంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు ’పీస్ ప్రెసిడెంట్’ అని వైట్‌హౌస్ అభివర్ణించింది. ఆయన చేతిలో ఒక ్గªల్ పట్టుకొని నడిచివస్తోన్న ఫొటోను షేర్ చేసింది. ఇదిలాఉంటే.. తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న ఆశలను ట్రంప్ మరోసారి వ్యక్తంచేశారు. శాంతి బహుమతి విజేతను నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో దానిగురించి శ్వేతసౌధంలో రిపోర్టర్లతో మాట్లాడారు. నోబెల్ సంగతి తనకు తెలియదని, అయితే ఏడు యుద్దాలు ఆపానని, ఎనిమిదో యుద్దాన్ని కూడా ఆపబోతున్నట్లు చెప్పారు.