ఆక్వారంగాన్ని ఆదరిస్తున్నం: సోమిరెడ్డి
అమరావతి,ఆగస్ట్3(జనం సాక్షి): ఆక్వా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆక్వా రైతులకు సంబంధించిన అంశంపై రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ అందించాలని తాను సీఎంను కోరానన్నారు. వెంటనే అందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. ఈశాన్య రాష్టాల్రలో ఆక్వా ఉత్పత్తులుపై నిషేధం విధించడంపైనా అధికారులతో చర్చించానని చెప్పారు. రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
లోకేశ్ వల్లనే ఐటి కంపెనీల రాకనారా లోకేష్‌ను మంత్రిగా తీసుకోవడం వల్లే ఏపీకి ఐటీ కంపెనీలు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కామాణిక్యవరప్రసాద్‌రావు అన్నారు. నిరుద్యోగ భృతి అమలుతో టీడీపీ మేనిఫెస్టో 99 శాతం అమలైనట్లేనని చెప్పారు. నిరుద్యోగ భృతి చాలా రాష్టాల్లో విఫలమైందని వివరించారు. బీజేపీ నేత సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీర్రాజు వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు కల్గుతున్నాయన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం తెలుసుకుంటుందన్నారు. అలాగే ప్రజల్లో మమేకం అవ్వడానికి గ్రామదర్శిని ప్రజాప్రతినిధులకు ఒక మంచి అవకాశం అని డొక్కా తెలిపారు.