ఆగని మంచినీటి వ్యాపారం

నల్లగొండ,జూలై23(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఎ/-లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ఎ/-లాంట్‌లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా విక్రయాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి ఎండలు అధికంగా ఉండడం, మంచినీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ను కొనుగోలు చేసారు. వర్షాకాలంలో కూడా వారి వ్యాపరం యధావిధిగానే సాగిస్తున్నారు. నాణ్యత లేని ప్యూరిఫైడ్‌ వాటర్‌ సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దీనికి స్థానిక నేతలు సహకారం అందిస్తున్నారు. దీంతో అధికారులు కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు. ఇలా జిల్లాల్లో పుట్టగొడుగుల్లా నీటి వ్యాపారం సాగుతోంది. వాటర్‌ఎ/-లాంట్‌ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. తనిఖీలు నిర్వహించి వారిపై చర్య తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్యాన్‌కు రూ. 10 నుండి 15 వరకు విక్రయాలు జరుపుతున్నారు. ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కాని వ్యాపారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా మారుమూల గ్రామాలకు కూడా క్యాన్లలో నీటిని తరలిస్తున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ పేరుతో గ్రామానికి వచ్చే నీటి వ్యాపారులు అధిక రేట్లకు నీటిని విక్రయాలు జరుపుతున్నారు.

తాజావార్తలు