ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

సిఎస్‌పురం , జూలై 28 : మండలంలోని కొండబోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం జరిగింది. డిజిపేట నుంచి సిఎస్‌పురం వస్తున్న ఆటో మార్గమధ్యంలోని కొండబోయినపల్లె మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొండబోయినపల్లి గ్రామానికి చెందిన బొర్రాజు సత్యం తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సత్యంను 108లో పామూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

తాజావార్తలు