ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థిని
కేసముద్రం ఆగస్టు 2 జనం సాక్షి /మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని జా టోత్ సమీరా ను కాలేజీ సిబ్బంది నిరాకరించారు.దీనితో మనస్థాపానికి గురైన సమీరా పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసింది.గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది.పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు.