ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

సిద్దిపేట,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  కుటుంబ కలహాల నేపథ్యంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కాపురానికి రావడం లేదంటూ రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొమ్ముల యాదగిరి (34) వాటర్‌ ట్యాంక్‌ పై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.