ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్యాటి లివర్ స్కానింగ్ _జైన రమేష్

 

( జనం సాక్షి) జూలై11:ప్రస్తుత ఆరోగ్య పరిస్థులలో మన సమాజం లో చాలా మందికి సహజంగా మధ్యపాణం,స్తులకాయం,అధికంగా కార్బో హైడ్రెడ్స్ (అన్నం) తినడం వలన మన శరీరం లోని లివర్ చాలా ఒత్తిడి కి గురై అధిక లావు అవడం సరిగా పనిచేయక పోవడం వల్ల మెల్ల మెల్లగా మనకు తెలియకుండానే అనారోగ్యం కు గురి అయి పూర్తిగా లివర్ చెడిపోవడం జరుగుతుంది. ఇలాంటి స్థితి ని ఫ్యాటి లివర్ అంటారు. ఈ పరిస్థితి ని విస్మరించినచో అది (సిర్రోసిస్ అఫ్ లివర్) పూర్తి స్థాయిలో లివర్ పని చేయక పోవడం కు దారి తీస్తుంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల లో జనగామలోని ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ఆధ్వర్యంలో ఆ లివర్ని స్కానింగ్ చేసి పరీక్షించుటకు (ఫైబ్రో స్కానింగ్ )శనివారం 16-07-2022 రోజున ఆదిత్య హాస్పిటల్ నందు ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమం ను రూపోందించనైనది.ఈ పరీక్ష ప్రస్తుత విపణి లో సుమారు 4000 రూపాయల విలువైనది. అలాంటి స్కానింగ్ ను ఉచితంగా ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మన యొక్క లివర్ స్థితి ని తెలుసుకొని సరియైన చికిత్స ను పొంది జనగామ జిల్లా ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాము.
ఈ సువర్ణ అవకాశన్ని ప్రతిఒక్కరు వినియోగించుకొని మీ లివర్ ను కాపాడుకుంటారని ఆశిస్తూ…
ఈ స్కానింగ్ చేసుకునే వారు మీ యొక్క పేరును మా హాస్పిటల్ నందు నేరుగా వచ్చి ఈ రోజు నుండే నమోదు చేసుకోగలరని కోరుచున్నాము. ఇంకా ఏమైనా తదితర వివరాలు కావాలంటే 7997912636 నెంబర్ ను సంప్రదించగలరాని మేనేజంగ్ డైరెక్టర్ ఆదిత్య హాస్పిటల్ జైన రమేష్ తెలిపారు