ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైబ్రో స్కానింగ్ కు అపూర్వ స్పందన

జనగామ (జనం సాక్షి)జూలై16:జనగామ లోని ఆదిత్య  హాస్పిటల్  ఆధ్వర్యంలో కల్నేల్ డాక్టర్ మాచర్ల  బిక్షపతి  సారధ్యం లో ఉచితంగా నిర్వహించిన  ఫైబ్రో స్కానింగ్ (లివర్ పరీక్షలు) నందు  జనగామ జిల్లా లోని సుమారు 200 మందికి  ఉచితంగా స్కానింగ్ నిర్వహించడం జరిగింది  అని హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ జైన  రమేష్   తెలిపారు.ఈ కార్యక్రమం ను జనగాం  జిల్లా ప్రభుత్వ  ఆసుపత్రి సుపరేండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు   ప్రారంభించి ఇలాంటి అత్యుతమైన  కార్యక్రమం ని చేపట్టి ప్రజలకి  మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారని మన కల్నెల్ బిక్షపతి ని ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు.ఈ సందర్బంగా కల్నల్ డాక్టర్ బిక్షపతి  మాట్లాడుతూ ఈ లివర్ స్కానింగ్ వల్ల మన లివర్ యొక్క స్థితి ని తెలుసుకొని దానికి  నివారణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని పొంది  వారి కుటుంబాన్ని కాపాడుకుంటారని  ఆశిస్తూ ఈ స్కానింగ్ ని నిర్వహించాము, దేశంలో ప్రస్తుత  యువత  ఆల్కహాల్ కు బానిసలై  ఆరోగ్యాన్ని క్షిణించు కుంటున్నారని కావున అతిగా  ఆల్కహాల్ సేవించడం  మంచిది  కాదని, అందరూ ఆరోగ్యావంతమైన జీవితము కావాలంటే దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు.
హాస్పిటల్ యాజమాన్యం తరుపున జైన రమేష్ మాట్లాడుతూ  ఈ స్కానింగ్  60లక్షలు  విలువైన  మరియు అరుదైనా మెషిన్  ద్వారా స్కానింగ్ చేయడం జరిగింది. ఈ మెషిన్ మన తెలంగాణ లోనే రెండవ మెషిన్ అని, దీనికి  అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి సుమారు 4000  రూపాయల చొప్పున  ఈ రోజున సుమారు 8 లక్షల  విలువైన  స్కానింగులు చేపట్టడం జరిగింది.. దీనికి  సహకరించిన జైడ్యూస్  హెల్త్ కేర్ కి  ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియ చేస్తూ  ఇలాంటి కార్యక్రమం లను రాబోయే కాలంలో కూడా నిర్వహిస్తామని తెలియచేస్తూ  ఈ కార్యక్రమం లో పాల్గొని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమం లో ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యం బద్రీనాధ్, దోర్నాల రమేష్,రవి కిరణ్,రాజేష్, రాజేంద్ర ప్రసాద్,ముస్తఫ, రియాజ్,రహీంద్దీన్,హరీష్ రెడ్డి, వంశీ, రాజు, నాగలక్ష్మి, హేమలత, అశ్విని, జ్యోతి, మాధవి,తదితరులు పాల్గొన్నారు.