*ఆదివాసీ మహిళలపై పోలీసుల దౌర్జన్యం మానవ హక్కుల ఉల్లంఘనే జై భారత్*

కొడకండ్ల, జులై15(జనం సాక్షి):
తరతరాలుగా అడవిపై ఆధారపడి, పోడు వ్యవసాయం చేసుకుంటూ, బ్రతుకుతున్న ఆదివాసులపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య, నిరంకుశ, అణచివేత వైఖరిని జైభారత్ ఖండిస్తోందని,
మంచిర్యాల జిల్లా కోయపోష గుడెంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు పాల్పడిన అమానుష దాడిని జైభారత్ ఖండిస్తోందని,
ఆదివాసీ మహిళలపై పోలీసుల దౌర్జన్యం చేసిన తీరు కలచివేసే విధంగా ఉందని, ఈ దారుణం మానవ హక్కుల ఉల్లంఘనే అని, దాడికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు పరిహారం చెల్లించి, న్యాయం చేయాలనీ జైభారత్ రాష్ట్ర నాయకులు భూక్య శ్రీను నాయక్ డిమాండ్ చేశారు.అంతేకాకుండా
పోడు భూముల పట్టాలను క్రమబద్దీకరిస్తానని గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వాగ్దానం చేయడం జరిగిందని, ఈ వాగ్దానం నెరవేర్చాలనీ, ఆదివాసుల భూముల క్రమబద్ధీకరణ సమస్య తక్షణమే పరిష్కరించాలనీ, ఆదివాసులకు న్యాయం చేయాలనీ,
ఆదివాసులకు రక్షణ కల్పించే చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేయాలనీ, ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలనీ, ఆదివాసులపై దౌర్జన్యాలకు సంపూర్తిగా ముగింపు పలకాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జైభారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు.