ఆధార్‌ ఆధారంగా జూన్‌ ఒకటి నుంచి నగదు బదిలీ

వీరప్పమొయిలీ
న్యూఢిల్లీ, మే 15 (జనంసాక్షి) :
నగదు బదిలీ వల్ల ప్రజల కెంతో మేలు జరుగు తుందని, రాయితీ సొమ్ము నేరుగా వారి ఖాతాలోనే జమచేస్తా మని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. బుధ వారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆధార్‌ బ్యాంకు ఖాతా తప్పనిసరి అని, జూన్‌ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నగదు బదిలీ పథకాన్ని తొలుత దేశవ్యాప్తంగా మొత్తం 20 జిల్లాల్లో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ను సబ్సిడీపై 465 రూపాయలకే అందజేయనున్నామని అన్నారు. రాయితీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలోకే  చేరుతుం దన్నారు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్యాస్‌ వినియోగదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. నగదు బదిలీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు.