ఆనంద బుద్ధ వీహార ట్రస్టుపై విచారణకు ఆదేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను దీనిపై విచారణ జరిపి నివేదికను రెండు నెలలలోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టు వ్యవస్థాపకుడు సి.అంజనేయరెడ్డి, ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్‌ చీఫ్‌ మాంక్‌ సంఘరక్షిత మహతో లేఖలను ఉటంకిస్తూ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించింది. దీనిపై ఈ ఏడాది మే నెలలో అదనపు అడ్వకేటు జనరల్‌ అబిప్రాయాన్ని తీసుకున్న ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలని నిర్ణయించి ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజావార్తలు