ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..
– మండల కాంగ్రెస్ నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి):
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు ,అనిల్ ,కొత్త ఆంజనేయులు, రామ్, శ్రీకాంత్ లు అన్నారు. సోమవారం
ఊరుకొండ మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కురువ ఎల్లమ్మ(50) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. అనారోగ్యంతో మృతిచెందిన విషయం గ్రామ కమిటీ నాయకుల ద్వారా తెలుసుకున్న మాదారం సర్పంచ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ధ్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం తన వంతు సాయంగా నిఖిలన్న యువసేన పేరిట రూ.5000/- తక్షణ ఆర్థిక సహయం కాంగ్రెస్ నాయకుల చేత బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. పేదరికం కారణంగా సరైన వైద్యం అందక ఎంతోమంది మృతి చెందుతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని వారు వాపోయారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు ,అనిల్ ,కొత్త ఆంజనేయులు, రామ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.