ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది


విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది: విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లు ఆక్రమించిన తరువాత భారత్‌ తొలి సారి స్పందించింది. ఆఫ్ఘన్‌ లో తాలిబన్ల రాజ్యం ఇంకా ప్రారంభదశలోనే ఉందన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌. ప్రస్తుతానికి కాబూల్‌ లో జరుగుతున్న పరిణామాలపై సమీక్షిస్తున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో తమ చారిత్రక మైత్రి ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే మున్ముందు ఆఫ్ఘనిస్థాన్‌ తో సంబంధాలను నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతానికి అక్కడ చిక్కుకున్న భారత పౌరుల భద్రత, వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడంపైనే దృష్టి పెట్టామన్నారు. అక్కడి హిందువుల, సిక్కులను క్షేమంగా దేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అన్ని దేశాల్లాగే తామూ ఆఫ్ఘనిస్థాన్‌ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌ లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఆయన.. తాలిబన్లతో భారత్‌ టచ్‌ లో ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.