ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

2

– 30 మంది మృతి

కాబూల్‌,జూన్‌ 30(జనంసాక్షి):ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 30 మంది ట్రైనీ పోలీస్‌ క్యాడెట్లు చనిపోగా, మరో 58 మంది గాయపడ్డట్టు ఆఫ్ఘనిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు స్థానిక పౌరులున్నారు. దేశ రాజధాని కాబూల్‌ కు 20 కిలోవిూటర్ల దూరంలోని పాగ్మాన్‌ జిల్లా పరిధిలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. పోలీస్‌ క్యాడెట్లు వార్దక్‌ ప్రావిన్స్‌ లో శిక్షణ పూర్తి చేసుకొని సెలవుపై కాబూల్‌ వస్తుండగా ఈ ఘటనలు జరిగాయి. పోలీస్‌ క్యాడెట్లు, శిక్షకులు వస్తున్న రెండు బస్సులపై మొదటి సూసైడ్‌ బాంబర్‌ దాడి చేశాడు. ఆ తర్వాత 20 నిమిషాలకు వీరికి సహాయం చేయడానికి వచ్చిన పోలీస్‌ బస్సుపై మరొకడు ఆత్మాహుతి దాడి చేశాడు. ఇది మానవత్వంపై దాడి అని ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు ఘని వ్యాఖ్యానించారు.పది రోజుల క్రితం ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ దాడిలో 14 మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. కాగా గత ఏప్రిల్‌ నెలలోనే కాబూల్‌ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 64 మంది చనిపోయారు. తాలిబన్లు మరోమారు తెగబడ్డారు. నరమేధానికి పూనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పోలీస్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 40 మంది పోలీసులు చనిపోయారు. మరో వంద మంది గాయపడ్డారు. పోలీస్‌ అకాడవిూకి చెందిన క్యాడెట్లతో కాబూల్‌ నుంచి వార్దాక్‌ ప్రావిన్స్‌ కు వెళ్తున్న వాహనాలపై సుసైడ్‌ బాంబర్లు దాడి చేశారు. దాడికి తామే కారణమంటూ తాలిబన్లు ప్రకటించారు. చనిపోయిన పోలీసులంతా ఇటీవలే ట్రైనింగ్‌  పూర్తి చేసుకున్నారు.